16 June, 2026 | 1:17 AM

మోగిన బడి గంట

16-06-2026 12:01 AM
  1. అమావాస్య కావడంతో తొలి రోజు హాజరు అంతంతే!
  2. నేడు మంగళవారం కావడంతో అదే పరిస్థితి రిపీట్?
  3. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించడమే లక్ష్యం
  4. రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
  5. ఖైరతాబాద్ లోక్‌భవన్ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం, పాలు పథకాన్ని ప్రారంభించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం 

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా బడిగంట మోగిం ది. వేసవి సెలవుల తర్వాత సోమవారం నుం చి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 27వేల ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు, 11,129 ప్రైవేట్ పాఠశాలల్లో కలి పి మొత్తం దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే తొలిరోజు చాలా స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే నమోదైనట్లు తెలిసింది. కొన్ని స్కూళ్లలో ఒకరిద్దరే హాజరైతే, మరికొన్ని చోట్ల పదుల సంఖ్యలోనే విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం అమావాస్య కావడంతో తమ పిల్లలను తొలిరోజు పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రు లు విముఖత చూపారు.

ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి కూడా దాదాపు ఇంతే. డోర్నకల్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదిహేను మంది ఉపాధ్యాయులుంటే, విద్యార్థులు ఇద్దరే స్కూల్‌కు వచ్చారు. మరోకచోట విద్యార్థులెవ్వరూ హాజరుకాకపోవడంతో ఆ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులను ఆరాతీయగా అమావాస్య కావడంతోనే పిల్లలను స్కూళ్లకు పంపించలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. నేడు మంగళవారం.. దాదాపు ఈరోజు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశముంది.

కాగా పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విద్యార్థులకు అల్పాహారం, పాలు పథకాన్ని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఖైరతాబాద్‌లోని లోక్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించడం, ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తోడ్ప డటం, పాఠశాల హాజరును పెంచడం, డ్రాప్‌అవుట్లను తగ్గించడం ప్రధాన లక్ష్యమని పేర్కొ న్నారు.

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా బడిబాట’ కార్యక్రమం చేపట్టామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 29 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, పాలు పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుం దని తెలిపారు. ప్రభుత్వం ఈ పథకానికి ఏటా రూ.720 కోట్లు వెచ్చించనుంది. ఇందులో అల్పాహారం కోసం రూ.540 కోట్లు, పాల సరఫరా కోసం రూ.180 కోట్లు ఖర్చు చేయనుంది.

స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం అమలు కానుంది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 672 ప్రభుత్వ పాఠశాలల్లో 93,501 మంది విద్యార్థులు చదువుతున్నారు. తొలి దశలో 45 పాఠశాలలను ఎంపిక చేయ గా, 12,437 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. మన్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు కానుం ది. ఇందులో 23 ప్రాథమిక పాఠశాలలు, 2 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు, 20 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యశస్వినీ రెడ్డి, హైద రాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, డీఈ వో యాదయ్య, మన్నా ట్రస్ట్ సీఈవో లీనా జోసెఫ్తో పాటు అధికారులు పాల్గొన్నారు. 

వారంలో అందించే అల్పాహారం మెనూ

సోమవారం:దోసె- పాలు

మంగళవారం: మిల్లెట్, ఇడ్లీ- రాగి జావ

బుధవారం: పూరీ కుర్మా, పాలు

గురువారం:మిల్లెట్,ఇడ్లీ- రాగిజావ

శుక్రవారం: మిల్లెట్, ఉప్మా/పొంగల్ -చట్నీ, పాలు

శనివారం: బొండా- రాగి జావ