1 June, 2026 | 5:24 PM

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

01-06-2026 04:23 PM

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు సోమవారం నాడు నోటిఫికేషన్(Rajya Sabha Election Notification 2026) విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 8 వరకు నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నెల 18న 10 రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోందని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ECI ప్రకారం, అన్ని ఎన్నికలకు పోలింగ్ జూన్ 18న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడుతుంది. అదే రోజున సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కించి, ఫలితాలను వెల్లడిస్తారు.

ECI పూర్తి ఎన్నికల షెడ్యూల్‌

నామినేషన్ల దాఖలు ప్రారంభం - జూన్ 1, ఉదయం 11 గంటల నుండి

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ - జూన్ 8, మధ్యాహ్నం 3 గంటల వరకు

నామినేషన్ల పరిశీలన - జూన్ 9

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - జూన్ 11

పోలింగ్ రోజు - జూన్ 18, ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు

ఓట్ల లెక్కింపు - జూన్ 18, సాయంత్రం 5 గంటల నుండి