11 May, 2026 | 11:49 AM

Breaking News

యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •   ORRపై రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు   •  

జాలి పడేదెవ్వడు మగాడి మీద..

25-01-2026 12:43 AM

భార్యాభర్తల తగువులు, గిల్లికజ్జాలు, సంసారం చుట్టూ అల్లే కథలు ఎప్పటికీ ప్రేక్షకులకు బోర్ కొట్టవు. ఇక ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా భార్యాభర్తల బంధాన్ని వివిధ కోణాల్లో టచ్ చేస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పురుషః’. వీరు వులవల దర్శకత్వం  వహిస్తున్న ఈ మూవీతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నాడు. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, వీటీవీ గణేశ్, సప్తగిరి, పమ్మి సాయి, పవన్‌కళ్యాణ్, కసిరెడ్డి రాజకుమార్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్, శ్రీసంధ్య, గబిరాక్, అనైరా గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రంలోని ‘జాలి పడేదెవ్వడు.. మగాడి మీద జాలి పడేదెవ్వడు’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను ఎంఎం కీరవాణి ఆలపించారు. శ్రవణ్ భరద్వాజ్ స్వరపర్చిన ఈ గీతానికి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. సినిమా కథను వివరించేలా, కథనాన్ని అందరికీ ముందే చెప్పినట్టుగా ఉందీ పాట. ఎంతో ఫన్నీగా సాగిన ఈ లిరిక్స్ భార్యాభర్తల మధ్య బంధాన్ని వివరించాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీశ్ ముత్యాల; ఎడిటర్: కోటి; ఆర్ట్: రవిబాబు దొండపాటి.