1 July, 2026 | 9:59 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

డీసీపీ ఆఫీసులో ‘నో హెల్మెట్ నో ఎంట్రీ’

17-04-2026 12:23 AM

మంచిర్యాల, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): రోడ్డు భద్రతను పెంపొందించేందుకు, హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అరైవ్ -అలైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ‘నో హెల్మెట్  నో ఎంట్రీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ ఎగ్గడి భాస్కర్ మాట్లాడుతూ డీసీపీ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌లలో పనిచేసే సిబ్బంది హెల్మెట్ లేకుండా వస్తే ఆవరణలోకి అనుమతించబడరని స్పష్టం చేశా రు. ట్రాఫిక్ నియమాలను పాటించాలని అధికారుల పిలుపునిచ్చారు.