1 July, 2026 | 8:53 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు

17-04-2026 12:21 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కె.హరిత వైద్యాధికారులకు సూచించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం తో కలిసి ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున వడదెబ్బ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, గర్భిణీల వివరాలను 100 శాతం నమోదు చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు, సిబ్బంది రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు ధాన్యాన్ని ఉదయం 11 గంటల లోపు లేదా సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే తీసుకురావాలని తెలిపారు.