26 April, 2026 | 7:51 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

నితీశ్ సంచలన నిర్ణయం?

05-03-2026 12:38 AM
  1. బీహార్ సీఎం పదవికి రాజీనామా! 
  2. రాజ్యసభకు వెళ్లే అవకాశం 

పాట్నా, మార్చి 4: బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన పదవికి  రాజీనా మా చేసి రాజ్యసభ కు వెళ్లే యోచనలో ఉన్నట్లు బుధవారం పాట్నా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గురువారంతో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనున్న తరుణంలో, నితీశ్‌కుమార్ తన స్థానాన్ని బీజేపీ  నేతకు ఇచ్చి, తన కుమారుడు నిషాంత్ కుమార్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

హోలీ పండుగ రోజే జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా, కేంద్ర మంత్రి లాలన్ సింగ్ వంటి కీలక నేతలు నితీశ్ నివాసంలో సమావేశం కావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇప్పటికే నిషాం త్ కుమార్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తారని పార్టీ సీనియర్ నేతలు ప్రకటించగా, పాట్నాలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆయనకు మద్దతుగా పోస్టర్లు కూడా వెలిశాయి.