21 April, 2026 | 9:54 PM

నిర్మల్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి

21-04-2026 08:25 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఎంతో చరిత్ర కలిగిన నిర్మల్ పట్టణాన్ని టూరిజం అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వెల్లడించారు. జిల్లా ఇంచార్జ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో మూడు రోజుల్లో ఓ బృందం నిర్మల్ లో పర్యటించి టూరిజం అభివృద్ధిపై యాక్షన్ ప్లాన్ రూపొందిస్తుందని తెలిపారు. నిర్మల్ జిల్లాను టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సంపూర్ణ అవకాశాలు ఉన్నాయని తెలిపారు