28 August, 2026 | 7:16 PM

Breaking News

పల్లె దవాఖాన, పీహెచ్సీ సబ్ సెంటర్‌ లను వెంటనే తెరవాలి   •   బాన్సువాడలో నూతన ఎస్ఆర్వో భవన నిర్మాణానికి స్థల పరిశీలన   •   మహేందర్‌ను పరామర్శించిన సునీల్ రావు   •   మందకృష్ణ మాదిగ పోరాటంతోనే వికలాంగులకు హక్కుల సాధన   •   ఆల్లాపూర్ ఎక్స్ రోడ్ లో స్వీట్ హార్ట్ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం   •   అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లకు ప్రతీక రక్షాబంధన్   •   దుమ్ము రేపుతున్న రోడ్డు పనులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం!   •   సోదర భావానికి ప్రతీక.. రాఖీ పర్వదినం   •   శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో రాఖీ వేడుకలు   •   పరస్పర మైత్రికి రక్షాబంధన్‌.. సంప్రదాయ పరిరక్షణకు జంధ్యాధారణ   •  

రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

28-08-2026 03:54 PM

నిర్మల్,ఆగస్టు28(విజయక్రాంతి): రాఖీ పండగ ( Raksha Bandhan greetings) సందర్భంగా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మహిళలకు రక్షణ, గౌరవం కల్పించాలనే బాధ్యతను ఈ పండుగ గుర్తుచేస్తుందని తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ మరోసారి జిల్లా ప్రజలందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.