ఉట్నూర్ బస్టాండ్లో కిక్కిరిసిన ప్రయాణికులు
బస్సులు తక్కువ ప్రయాణికులు ఎక్కువ.
ఉట్నూర్,ఆగస్టు28,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) అమలు చేయడంతో మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించినందుకు శుక్రవారం రాఖీ పండుగ పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆర్టీసీ బస్టాండ్(Utnoor RTC Bus Stand) ప్రయాణికులతో కి క్కిరిసిపోయింది. తెలంగాణరోడ్డు రవాణా సంస్థ వారు బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికుల సంఖ్య ఎక్కువ పెరగడంతో బస్సులు సరిపోక బస్సులలో కిక్కిరిసి నిలబడి ఇబ్బందులు పడుతూ ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. శుక్రవారం రాఖీ పండుగ సందర్భంగా అక్క చెల్లెలు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి వారి వారి గ్రామాలు వెళ్లడానికి ఉట్నూర్ బస్టాండు కు అధిక సంఖ్యలో రావడంతో బస్టాండ్ కిటకిటలాడింది.
మహిళా ప్రయాణికులు ఎక్కువ ఉండడం బస్సులు తక్కువ వల్ల సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు బస్టాండ్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది . ప్రతి బస్సు లో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడంతో బస్సులు కిట కిటలడాయి. ఆర్టీసీ అధికారులు రాఖీ పౌర్ణమి రోజు ప్రత్యేక బస్సులు నడుపుతామని ప్రకటించిన, ఉట్నూర్ బస్టాండ్ లో ప్రత్యేక బస్సులు నడిపక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ బస్సు ప్రయాణాలు కొనసాగించారు. ఉట్నూర్ కేంద్రం నుండి ఆసిఫాబాద్, మంచిర్యాల్, అదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాలతో పాటు పక్కనున్న మహారాష్ట్రకు ఈ ప్రాంతం నుండి మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు బస్సుల కోసం వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది.రాఖీ పండుగ కాకుండా వేరే రోజుల్లో కూడా చాలా బస్సులు అధిక ప్రయాణికులతో బస్సులను నడిపిస్తున్నారు.
ఎక్కువ సంఖ్యలో బస్సులో ప్రయాణించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడడంతో పాటు బస్సులు చెడిపోతున్న ఆర్టీసీ అధికారులు మాత్రం బస్సుల సంఖ్య పెంచడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. పురుషులు టికెట్ పెట్టి కిలోమీటర్ల కొలది బస్సులో నిల్చోని ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు ఎక్కువ ప్రాంతం ప్రయాణం చేసే ప్రాంతాలకు బస్సుల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా ఇబ్బందులు పడుతూ ఎన్నాళ్లు ప్రయాణం చేయాలని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ అధికారులు ఇకనైనా బస్సుల సంఖ్య పెంచి ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత మహిళ ప్రయాణికుల సంఖ్య రోజుకు పెరగడంతో పురుషులు డబ్బులు పెట్టి టికెట్లు తీసుకొని ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేయాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు.






