31 May, 2026 | 7:36 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

అభిషేక్ శర్మకు జరిమానా

04-04-2026 01:28 AM

కోల్‌కతా, ఏప్రిల్ 3: ఐపీఎల్ 19వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మకు షాక్ తగిలింది. మైదానంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనికి బీసీసీఐ జరిమానా విధించింది. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీకి దగ్గరగా ఉన్న సమయంలో క్యాచ్ రూపంలో అవుటయ్యాడు. అయితే వరుణ్ చక్రవర్తి పట్టిన ఆ క్యాచ్ కాస్త కన్ఫ్యూజన్‌గా ఉండటంతో ఫీల్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. క్యాచ్ పట్టుకునే సమయంలో బంతి నేలను తాకుతున్నట్లు కనిపించింది.

అందరూ నాటౌట్ అనుకుంటే థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. దాంతో అసహనానికి గురైన అభిషేక్ శర్మ అంపైర్న్ అసభ్య పదజాలంతో దూషించాడు. దీనికి శిక్షగా అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అభిషేక్ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చింది. ఐపీఎల్ నిబంధనలలోని ఆర్టికల్ 2.3 కింద లెవెల్  నేరానికి పాల్పడినట్లు అభిషేక్ శర్మ అంగీకరించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అసభ్య పదజాలాన్ని ఎవరైనా ఉపయోగిస్తే వారికి ఆర్టికల్ 2.3 కింద లెవల్  నేరం వర్తిస్తుంది.