calender_icon.png 21 February, 2026 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయనగరం ఉగ్రకుట్ర కేసులో ఎన్ఐఏ మరో ఛార్జిషీట్

21-02-2026 10:54:16 AM

న్యూఢిల్లీ: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో ఎన్ఐఏ మరో ఛార్జ్ షీట్(NIA Charge Sheet) దాఖలు చేసింది. ఆరిఫ్ హుస్సేన్, ఇమ్రాన్ అక్రమ్ పై విశాఖ ఎన్ఐఏ కోర్టులో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. విజయనగరంలో పేలుళ్ల కుట్ర ఘటనపై సిరాజ్, సయ్యద్ సమీర్ పై కేసు బుక్ చేశారు. విజయనగరం పోలీసులు పెట్టిన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేశారు. ఎన్ఐఏ సిరాజ్, సయ్యద్ సమీర్ పై నవంబర్ లో తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

ఇమ్రాన్ అక్రమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సిరాజ్, సమీర్ కు పేలుడు పదార్థాలు తయారుచేసేందుకు సాయం చేసినట్లు గుర్తించారు. పేలుడు సామగ్రి కొనేందుకు ఇమ్రాన్ ఫండింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. విదేశాలకు పారిపోతున్న ఆరిఫ్ ను ఎన్ఐఏ అధికారులు గతేడాది పట్టుకున్నారు. సిరాజ్ తో కలిసి ఆయుధాలు సరఫరా చేసేందుకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. సరిహద్దుల నుంచి అక్రమంగా ఆయుధాలు రవాణా చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. సోషల్ మీడియా ద్వారా జిహాదీ సిద్ధాంతాన్ని ప్రచారం చేసినట్లు దర్యాప్తులో తెలిసిందని అధికారులు పేర్కొన్నారు.