calender_icon.png 21 February, 2026 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీటెక్కిన కామారెడ్డి

21-02-2026 11:57:20 AM

హైదరాబాద్: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వెంకటరమణారెడ్డి ఇంటి ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డిని(Congress leader Mahender Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి కారును ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు కారుకు నిప్పుపెట్టారు. కామారెడ్డిలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బీజేపీ- కాంగ్రెస్(BJP-Congress) నేతల సవాళ్లతో కామారెడ్డి హీటెక్కింది. కామారెడ్డి పోలీసులు శనివారం ఉదయం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కె. వెంకటరమణ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. గొడవలు జరగకుండా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలను కూడా ముందస్తు అరెస్ట్ అరెస్ట్ చేశారు. శిశు మందిర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భూముల కబ్జా ఆరోపణలు, ప్రత్యారోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం అయ్యాయి. 

అరోరా భూములపై చర్చకు రావాలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి(MLA Venkataramana Reddy) సవాల్ విసిరారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అటు అరోరా భూ సమస్యపై శిశు మందిరంలో జరిగిన చర్చలో పాల్గొనకుండా అడ్డుకున్నారు. శిశు మందిరానికి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ఆయన పోలీసులను కోరినప్పటికీ, పోలీసులు అతన్ని అనుమతించలేదు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని గ్రహించిన పోలీసులు రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచి, కాంగ్రెస్ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.