15 May, 2026 | 8:14 PM

Breaking News

పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •   జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు   •   ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి   •   మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్   •   ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం   •   ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు   •   దొంగలు... బాబోయ్... దొంగలు...   •   చెంచుల జీవనోపాధికి టీజీఐఎల్పీ కీలకం   •   మోడీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. రెండు నాలుకల సర్కార్   •   మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సోమయ్య   •  

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

20-12-2025 03:24 PM

కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి. మాజీ ఎంపిటిసి గొల్ల నరసింహులు. 

రేగోడు: రాబోయేది  బిఆర్ఎస్ ప్రభుత్వంమే అని మాజీ ఎంపిటిసి గొల్ల నరసింహులు అన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరపున వార్డ్ మెంబర్ గా పోటీ చేసిన వారి తోపాటు  బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అధర్యపడవద్దని రాబోయేది  బిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు, ప్రతి కార్యకర్త కలసికట్టుగా పనిచేయాలని సూచించారు.

పంచాయతీ ఎన్నికల్లో  కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అందరూ కష్టపడి చాలా ఓట్లు రాబట్టగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రేగోడు గ్రామ అధ్యక్షులు రాచోటి సుభాష్, మాజీ సర్పంచ్లు బాదనపల్లి నరసింహులు, గోపాల కృష్ణ యాదవ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు మొయిజుద్దీన్, నాయకులు మునిరోద్దీన్, కోట సంగప్ప, గొల్ల శేఖర్ , రాజు కమల్, అమృత్, రాచోటి నాగరాజు, ఉప్పరి సాయిలు, శ్రీనివాస్, సల్మాన్, అమృత, గోపాన్ పల్లి అంజప్ప, గొల్ల శివన్న, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.