calender_icon.png 6 February, 2026 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసముద్రం పట్టణంలో సరికొత్త ‘వెలుగు’లు

06-02-2026 01:36:56 AM

ప్రతి విద్యుత్ స్తంభానికి వీధిలైటు ఏర్పాటు 

కేసముద్రం, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీలో ప్రభుత్వం పై లెట్ ప్రాజెక్టు కింద సరికొత్తగా వీధి లైట్లను ఏర్పాటు చేయిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కృ షితో ప్రత్యేకంగా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఇండి యా లిమిటెడ్ ద్వారా కొత్తగా 2,773 వీధిలైట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

ఇప్పటివ రకు 1,700 వీధిలైట్లను ఏర్పాటు చేశారు. పీ టీసీ సంస్థ సాంకేతిక సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది సంయుక్తంగా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి విద్యుత్ స్తంభానికి విప్రో కంపెనీ ఎల్‌ఈడీ వీధిలైట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనితో కొత్త ము న్సిపాలిటీ లో సరికొత్త వీధిలైట్ల వెలుగుళ్లో జిగేల్ మంటోంది. కొత్తగా ఏర్పాటు చేసే 2,773 వీధిలైట్లకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించడంతోపాటు, ఏడేళ్లపాటు నిర్వహణ బాధ్యతను కూడా మున్సిపాలిటీ కి భారం కాకుండా సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ప్రత్యేక చొ రవ తీసుకున్నారు.

ఆటోమేటిక్ సిస్టం అమలు

పైలెట్ ప్రాజెక్టు పథకంలో భాగంగా కేసముద్రం మున్సిపాలిటీలో నూతనంగా ఏ ర్పాటు చేస్తున్న వీధిలైట్లను ప్రతిరోజు రాత్రి కాగానే సిబ్బంది వెలిగించడం, తెల్లవారుజామున ఆపివేయడం ఉండదు. సీసీఎంఎస్ సెన్సార్ సిస్టం ఏర్పాటు వల్ల ఎక్కడికక్కడే రాత్రి కాగానే ఆటోమేటిక్ గా వీధిలైట్లు వెలగడం, తెల్లవారగానే ఆరిపోవడం జరుగుతుంది. 

ఏడు సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ ఫ్రీ

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో నూ తనంగా ఏర్పాటు చేస్తున్న 2,773 వీధిలైట్ల నిర్వహణ బాధ్యత పూర్తిగా పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ సంస్థ చూసుకుంటుంది. మున్సిపాలిటీ సిబ్బందికి వీధిలైట్ల అంశంలో ఎ లాంటి జోక్యం ఉండదు.

వీధిలైట్ల నిర్వహణ, మరమ్మతులు, పాడైపోయిన వాటిని తొలగించి, కొత్తవి ఏర్పాటు చేయడం తదితర అంశాలన్నీ పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ సంస్థనే చూసుకుంటుంది. దీనితో మున్సిపాలిటీకి ఏడు సంవత్సరాలపాటు వీధిలైట్ల వ్యవహారానికి దూరంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు సంస్థ సిబ్బంది వీధిలైట్ల నిర్వహణ బాధ్యతను పర్యవేక్షిస్తూ, వీధిలైట్లు వెలగని చోట తక్షణమే కొత్తవి ఏర్పాటు చేయడం జరుగుతుంది.

కేటగిరి వారిగా వీధిలైట్ల ఏర్పాటు

కేసముద్రం పట్టణ పరిధిలో రద్దీ కనుగుణంగా వీధుల్లో వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. నా ణ్యమైన విప్రో కంపెనీకి చెందిన 18 వా ట్స్, 35 వాట్స్, 70 వాట్స్, 110 వాట్స్ వీధిదీపాలను ఏర్పాటు చేస్తున్నాం. వీధి దీపాలు ఏర్పాటు కోసం గతంలోనే స ర్వే నిర్వహించి, అందుకు అనుగుణంగా అంతర్గత, ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద, జన సమ్మర్థం అధికంగా ఉండే చోట ఎక్కువ వెలుతురు ఇచ్చే విధంగా కేటగిరి వారిగా వీధిలైట్లను ఏర్పాటు చేయడం జరుగుతోంది.

టి.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్, కేసముద్రం