21-02-2026 12:04:26 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి):సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణను కమిషనర్ జి. సృజన నగరంలో పరిశుభ్రత ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు, అధికారులలో జవాబు దారీతనాన్ని పెంచడమే లక్ష్యంగా ఆమె శుక్రవారం పారిశుధ్య ఎంటమాలజీ విభాగాలపై విస్తత స్థాయి సమీక్ష నిర్వహించారు.
సీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ముగ్గురు జోనల్ కమిషనర్లు అపూర్వ్ చౌహాన్ ,భోకాడే హేమంత్ సహదేవరావు ,సందీప్ కుమార్ ఝా తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విధుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, క్షేత్రస్థాయిలో మార్పు కనిపించాలని కమిషనర్ స్పష్టం చేశారు.
ఉదయం 6 గంటలకే డెడ్ లైన్..
పారిశుధ్య సిబ్బంది, చెత్త సేకరణ వాహనాల హాజరు విషయంలో కమిషనర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ ఉద యం 6 గంటలకల్లా క్షేత్రస్థాయిలో హాజరు నమోదు పూర్తి కావాలని ఆదేశించారు. సుదీ ర్ఘ కాలంగా విధులకు గైర్హాజరయ్యే సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పని విభజనలో పారదర్శకత కోసం వార్డుల వారీగా ప్రధాన అంతర్గత రహదారుల పొడవును లెక్కించి, అందుబాటులో ఉన్న సిబ్బందికి సమానంగా పని కేటాయించాలని ఆదేశించారు.
ప్రతి కార్మికుడికి ఒక నిర్దిష్ట రహదారి భాగాన్ని బాధ్యతగా అప్పగించాలని, తద్వా రా పనుల పర్యవేక్షణ సులభతరమవుతుందని ఆమె పేర్కొన్నారు. వీధులను ఊడ్చిన తర్వాత చెత్తను రోడ్డు పక్కన కుప్పలుగా వేయకుండా, వెంటనే నల్ల కవర్లు లేదా గన్నీ సంచుల్లోకి ఎత్తాలని కమిషనర్ సూచించారు. రోడ్లపై నిరుపయో గంగా ఉన్న వాహనాలను తొలగించాలని, వారాంతపు మార్కెట్ వ్యాపారులు వ్యర్థాలను రోడ్లపై వేయకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఇంటి వద్దే చెత్త వర్గీకరణ తడి, పొడి చెత్తపై ప్రజల్లో విస్తత అవగాహన కల్పించాలని, ఇందుకోసం క్షేత్రస్థాయి అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. ప్రజా మరుగుదొడ్లు ఎల్లప్పుడూ శుభ్రంగా, వినియోగంలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
దోమల నివారణకు డ్రై డే..
సీజనల్ వ్యాధుల నివారణకు ఎంటమాలజీ విభాగం అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచిం చారు. దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి యాంటీ లార్వా చర్యలను క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలన్నారు. ట్రాఫిక్ పోలీసులు, జల మండలి విద్యుత్ శాఖ అధికారులతో కలిసి సంయుక్త తనిఖీలు నిర్వ హించి సమస్యలను పరిష్కరిం చాలని సూచించారు. సమావేశంలో అదనపు కమిషనర్ యాదగిరి రావు, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, వెటర్నరీ వైద్యులు పాల్గొన్నారు.