27 July, 2026 | 10:06 PM

కలెక్టర్ ను కలిసిన జిల్లా నూతన ఎల్డిఎం నాగరాజు

27-07-2026 09:15 PM

భూపాలపల్లి,(విజయక్రాంతి): జిల్లా నూతన లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్డిఎం)గా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు సోమవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగరాజు కలెక్టర్‌కు మొక్కను అందజేశారు.గతంలో ఎల్డిఎంగా విధులు నిర్వహించిన తిరుపతి హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి బదిలీ కావడంతో, ఆయన స్థానంలో నాగరాజును నియమించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశాల్లో నిర్ణయించిన లక్ష్యాలను సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయం, స్వయం ఉపాధి, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారాలకు రుణాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకులు సమర్థవంతంగా భాగస్వామ్యం కావాలని, లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో బ్యాంకింగ్ సేవలను మరింత బలోపేతం చేసి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.