చివరి దశకు ఫోన్ టాపింగ్ కేసు విచారణ: డీజీపీ సీవీ ఆనంద్
ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించిన కొత్త డీజీపీ సీవీ ఆనంద్
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే రెండో చార్జిషీట్ వేస్తాం: డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) విచారణ చివరి దశకు చేరుకుందని డీజీపీ సీవీ ఆనంద్(DGP CV Anand) పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రస్తుతం సిట్ విచారణ చేస్తోందని ఆయన వెల్లడించారు. గతంలో హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడే.. ఆ కేసు గురించి తనకు తెలుసని చెప్పారు. త్వరలో ఆ కేసును సమీక్షించి తుది ఛార్జిషీట్ ఫైల్ చేస్తామని స్పష్టం చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సి.వి. ఆనంద్, శుక్రవారం లక్డీకాపూల్‌లో ఉన్న రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయడంతో పదవి నుంచి వైదొలగగా, ఆయన బాధ్యతలు స్వీకరించారు.






