1 May, 2026 | 5:12 PM

రెండేళ్లు భరించండి.. కేసీఆర్ వచ్చి మేలు చేస్తారు.. కేటీఆర్ హామీ

01-05-2026 03:40 PM

హైదరాబాద్: పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) డిమాండ్ చేశారు. సఫాయీల శ్రమను.. రేవంత్ రెడ్డి గుర్తించటం లేదని కేటీఆర్ ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక సర్కార్ నడుస్తోందని ధ్వజమెత్తారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కాంగ్రెస్ బాధితులయ్యారని తెలిపారు. మంత్రుల జీతాల్లో కోత వేసి ఇస్తామనడానికి వాళ్లు వరద బాధితులా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో 120 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని సూచించారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల భరించండి.. కేసీఆర్ వచ్చి కార్మికులకు మేలు చేస్తారని కేటీఆర్ హామీ ఇచ్చారు.