25 August, 2026 | 2:40 AM

బెజ్జూరులో ఏం జరుగుతోంది?

25-08-2026 12:30 AM

అభివృద్ధిని అడ్డుకునేది ఎవరు..? పాలకులా.. అధికారులా..?

గ్రామం అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం ఎవరిది..?

బెజ్జూరు, ఆగస్టు 2౪ (విజయక్రాంతి): బెజ్జూరు గ్రామపంచాయతీ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం ఎవరిది? అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారా? లేక పాలకవర్గం వైఫల్య మా? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలోని గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనుల పరిస్థితి అయోమ యంగా ఉందని పలువురు పేర్కొంటు న్నా రు. గతంలో ప్రత్యేక అధికారి పాలన ఉన్న సమయంలోనూ బెజ్జూరు గ్రామపంచాయతీలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలే దని స్థానికులు చెబుతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి ఎనిమిది నెలలు గడిచింది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ దుర్గం సరోజ ఆధ్వర్యంలోని పాలకవర్గం గ్రామంలో విద్యుత్ దీపాలు, మురికి కాలువలు, పలుచోట్ల గ్రావెల్ రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టింది.అయితే పను లు చేపట్టినప్పటికీ తాను బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా గెలవడం వల్లే బిల్లులు రావడం లేదని సర్పంచ్ దుర్గం సరోజ ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన సర్పం చ్ అభ్యర్థులకే బిల్లులు మంజూరవుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అధికారులు సైతం అధికార పార్టీ వైపే మొ గ్గు చూపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

అభివృద్ధి పనులపై అధికారుల తనిఖీ

జూలై 14న బెజ్జూరులో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మూట్ ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు గ్రా మపంచాయతీ రికార్డులను కూడా స్వాధీనం చేసుకుని తీసుకెళ్లినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో గ్రామంలో కొత్తగా అభివృద్ధి పను లు చేపట్టలేని పరిస్థితి నెలకొందని సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇటీవల స్ట్రీట్ లైట్ ల్పై 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపడటంతో పలు విద్యుత్ దీపాలు పనిచేయడం లేదని తెలిపారు. కొత్త విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేందుకు మండల అధికారులను అనుమతి కోరగా, అనుమతి లభించలేదని సర్పంచ్ పేర్కొన్నారు. దీంతో గ్రామంలోని పలు ప్రాంతాలు రాత్రివేళల్లో చీకటిమయంగా మారుతున్నాయని తెలిపారు.

గ్రామపంచాయతీ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొందని పాలకవర్గ సభ్యులు చెబుతున్నారు. గ్రామ అభివృద్ధికి సర్పంచ్, పాలకవర్గం సిద్ధంగా ఉన్న ప్పటికీ అధికారులు సహకరించడం లేదని వారు పేర్కొన్నారు. అధికారులు సహకరిస్తే బెజ్జూరు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామని సర్పంచ్ దుర్గం సరోజ తెలిపారు.

బెజ్జూరులో బస్టాండ్ నిర్మాణం సాధ్యమేనా..?

బెజ్జూరులో బస్టాండ్ నిర్మాణానికి స్థలం సరిపోకపోవడంతో ప్రతిపాదన ప్రశ్నార్థకంగా మారింది. పాత అంగడి బజార్కు సంబంధించిన సర్వే నంబర్ 237లో 1.20 గుంటల భూమి ఆక్రమణకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. అలాగే సర్వే నంబర్ 230లో 0.58 సెంట్ల భూమిని అప్పటి అధికారులు 1992లో చిరు వ్యాపారులకు కేటాయించినట్లు పేర్కొంటున్నారు. దాదాపు రెండు ఎక రాల వరకు ఉండాల్సిన పాత అంగడి బజా ర్ స్థలం ఆక్రమణకు గురికావడంతో ప్రస్తు తం బస్టాండ్ నిర్మాణానికి స్థలం అందుబాటులో లేదని పాలకవర్గం చెబుతోంది.

ఆక్రమణకు గురైన పాత అంగడి బజార్ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని గ్రామపంచాయతీకి కేటాయిస్తే, ప్రస్తుత అంగడి బజార్ను అక్కడికి తరలించి, ప్రస్తుతం అంగడి బజార్ ఉన్న ప్రాంతంలో బస్టాండ్ నిర్మాణం చేపట్టవచ్చని సర్పంచ్, పాలకవర్గ సభ్యులు సూచిస్తున్నారు.ఆక్రమణకు గురైన స్థలాన్ని ప్రణాళికాబద్ధంగా స్వాధీనం చేసుకుని గ్రామపంచాయతీకి అప్పగిస్తే సమస్య పరిష్కారమవుతుందని సర్పంచ్ సరోజ తెలిపారు. ప్రజలు, అధికారులు సహకరిస్తే బెజ్జూరు గ్రామపంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామని ఆమె పేర్కొన్నారు.

పంచాయతీ అభివృద్ధి సహకారం 

గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు తప్పకుండా వస్తాయని తెలిపారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థులకే బిల్లులు వస్తున్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచులందరికీ బిల్లులు మంజూరవుతాయని, బిల్లులు రావడం లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు .సకాలంలో బిల్లులు చెల్లిస్తామని, గ్రామపంచాయతీల అభివృద్ధికి అధికారులు అన్ని విధాలా సహకరిస్తున్నారు.

గురజాల శ్రీనివాస్,ఎంపీఓ