జొన్నల కొనుగోలులో నిర్లక్ష్యం సరికాదు
- రైతులు పండించిన ప్రతి పంటనూ ప్రభుత్వమే కొనాలి
- మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్, జూన్ 20(విజయక్రాంతి): జొన్నలు పండించిన రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని, రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కలెక్టరేట్ను వీడబోమని, ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టి రైతుల తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి హెచ్చరించారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని దంతేపల్లి, కాట్రియల, పర్వతాపూర్, కిషన్ తండా, జామ్లా తండా గ్రామాలకు చెందిన రైతులు జొన్నల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించి మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి రైతులతో కలసి ధర్నా నిర్వహించి సంఘీభావం ప్రకటించారు. జొన్నలను కొనుగోలు చేసిన అనం తరం మట్టి పేల్లలు ఉన్నాయనే కారణంతో మార్క్ఫెడ్ అధికారులు తిరిగి వెనక్కి పంపడాన్ని నిరసిస్తూ రైతులు ప్రభుత్వానికి వ్య తిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భం గా మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఎంతో క ష్టపడి పండించిన జొన్నలను ప్రభుత్వం కొ నుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇప్పటికే కొను గోలు చేసిన జొన్నలను నాణ్యత పేరుతో, మట్టి పేల్లలు ఉన్నాయనే సాకుతో తిరిగి రై తులకే అప్పగించడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫో న్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలియజేసిన ట్లు తెలిపారు. మార్క్ఫెడ్ అధికారులు జొన్నలను తిరిగి పంపిన విషయాన్ని మంత్రి దృ ష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
జొన్నల కొనుగోలుపై అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కలెక్టరేట్ కార్యాలయం నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుంచి జొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తూ రైతుల పక్షాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడు తూ...ఈ ఏడాది జొన్న పంట సాగు చేసిన రైతులు మార్కెట్లో సరైన ధర లేక, ప్రభుత్వ కొనుగోళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులు పండించిన ప్రతి పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్ప ష్టం చేశారు. మట్టి పేల్లలు ఉన్నా యనే కారణంతో జొన్నలను తిరస్కరించడం సమంజ సం కాదన్నారు. ఈ ధర్నాలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ అరేళ్ళ మల్లికార్జున్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు చౌదరి. సుప్రభాత రావు, కౌన్సిలర్ చౌదరి చరిత, తదితరులు పాల్గొన్నారు.






