21-02-2026 12:00:00 AM
మన దేశంలో చట్టాలు చేయడం లో ఉన్న ఉత్సాహం, వాటిని అమలు చేయడంలో ప్రదర్శించకపోవడం ఆనవాయితీగా మారింది. 16 ఏళ్ల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ‘ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) ఇందుకు ఒక సజీవ సాక్ష్యం. 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా వచ్చిన ఈ చట్టం, నేడు అమలుకు నోచుకోక అనాథలా మారింది.
తాజాగా సుప్రీం కోర్టు ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగ బాధ్యతను గుర్తు చేయాల్సి రావడం మన పాలనా వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతోంది. అయితే జన సంక్షేమ చట్టాల్ని నీరుగార్చటంలో మనకెవరూ సాటిరారని పదహారేళ్ల నాడు సాకార మైన విద్యాహక్కు చట్టం నిరూపించింది. ఇతర ప్రాథమిక హక్కులకూ, 21ఏ అధికరణం కింద వచ్చి చేరిన విద్యాహక్కుకూ మౌలికంగా వ్యత్యాసం ఉంది. ఇ తర హక్కులన్నీ పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకూ, జీవించే హక్కుకు ముడిప డినవైతే, ఇదొక్కటీ ప్రాథమిక విద్యను పిల్లల హక్కుగా పేర్కొంటు న్నది.
విద్యాహక్కు చట్టం..
విద్యాహక్కు చట్టం, 2009 ప్రకారం అణగారిన వర్గాల కుటుంబాల పిల్లలు తమ పొ రుగునున్న గుర్తింపు పొందిన ఏ పాఠశాలలోనైనా ఉచితంగా విద్య పొందవచ్చు. అ లాంటి వారి కోసం ప్రతి విద్యాసంస్థలు 25 శాతం సీట్లు అందుబాటులో ఉంచాలి. ఆ వర్గాల పిల్లలు దరఖాస్తు చేస్తే, ఫీజులు చెల్లించరన్న సాకుతో ప్రవేశం నిరాకరించకూ డదు. వారి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలి.
వినడానికి బాగున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఇసుమంతైనా ప్రయోజనం చేకూరడం లేదు. ఈ పథకం 2010 ఏప్రిల్ 1న మొదలైనప్పుడు కేంద్రంలోని అప్పటి యూ పీఏ ప్రభుత్వాన్ని అందరూ వేనోళ్ల కొనియాడారు. అప్పటికే ప్రాథమిక విద్యను హక్కుగా చేసిన 137 దేశాల సరసన మనం కూడా చేరామని సంబరపడ్డారు. ఏడాది తిరిగేసరికే దాని వాలకం తెలిసి పోయింది.
విద్యారంగ నిపుణులు ఎప్పటికప్పుడు ఈ విషయంలో హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలకు పట్టలేదు. అ నాథగా మారిన ఈ చట్టంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సమాజ పు రోగతిలో విద్యాసంస్థలు బలమైన ఉపకరణాలు.
భవిష్యత్తు నిర్మాణం..
అందుకే అణగారిన వర్గాలకు మాత్రమే కాదు.. కుల, మత, ఆర్థిక స్థోమతలతో సం బంధం లేకుండా పీజీ వరకైనా అందరూ ఉచితంగా చదువుకునే అవకాశం ఉండాలి. పాశ్చాత్య దేశాల్లో పీహెచ్‌డీ స్థాయిలో సైతం అందరికీ ఉచితంగా ప్రవేశాలిస్తున్నారు. అం దువల్లే అక్కడ ప్రపంచాన్ని శాసించే సంస్థలు ఆవిర్భ విస్తున్నాయి. సృజనాత్మకతలు వెల్లివిరుస్తున్నాయి. విద్యపై చేసే వ్యయాన్ని ఖర్చుగా కాక, అది భవిష్యత్ సమాజ నిర్మాణానికి పెట్టే పెట్టుబడిగా పరిగణించాలి.
అ దంతా దురాశ అవుతుందేమోగానీ... కనీసం ఒకటి నుంచి ఎనిమిదో తరగతిలోపు అట్టడుగు వర్గాల పిల్లలకు కూడా ఉచిత విద్య అందించలేక పోవటం తలదించుకోవా ల్సిన విషయం కాదా? అమలు చేతగానప్పుడు ఘనంగా కనబడేలా చట్టం చేయడం ఎందు కు? దాన్ని ప్రాథమిక హక్కు చేశామన్న చా టింపు ఎందుకు అన్నది ఆలోచించుకోవాలి. మహారాష్ట్రకు చెందిన ఒక పౌరుడు తన పిల్లలకు దగ్గర్లోని ప్రైవేటు విద్యాసంస్థ ప్రవేశం కల్పించటం లేదని, ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకుందని సుప్రీంకోర్టు తలుపుతట్టడంతో ఈ సమస్య చర్చకొచ్చింది.
ఇది ఆయనొక్కరి సమస్య మాత్రమే కాదు. దేశంలోని పలువురు తల్లిదండ్రులది కూడా ఇదే స్థితి అని చెప్పొచ్చు. గత్యంతరంలేని స్థితిలో చేర్చుకున్నా అలాంటి పిల్లల్ని ‘వెలి’ వేసి, విడిగా చదువు చెబుతున్న ఘనులు కూడా ఉన్నారు. ఇందుకు కారణం కార్పొరేట్ వి ద్యా మాఫియాల పలుకుబడి ప్రభుత్వాల్లో పెరగటమా లేక పిల్లల తరఫున ప్రభుత్వాలు చెల్లించాల్సిన ఫీజులు ఎగ్గొట్టడమా?
ఈ రెం డూ కారణాలైనా ఆశ్చర్యం లేదు. లాభార్జనపై పెద్దగా దృష్టిపెట్టకుండా తక్కువ ఫీజుల తో విద్యాసంస్థలు నడిపే వారే ప్రభుత్వాలకు జడిసి అంతో ఇంతో ఈ చట్టాన్ని అమలు చే స్తున్నారు. లేకుంటే తమ సంస్థ గుర్తింపు ఏదో సాకుతో రద్దుచేస్తారన్న భయం వారిని నిరంతరం వెంటాడు తుంటుంది.
నిబంధనలు బేఖాతరు..
విద్యా వ్యవస్థలో కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పెరగడం, ప్రభుత్వాలు సకాలంలో ఫీజుల రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం ఈ చట్టాన్ని నీరుగారుస్తున్నాయి. లాభాపేక్ష లేని చిన్న పాఠశాలలు భయంతోనైనా ఈ చ ట్టాన్ని అమలు చేస్తున్నాయి కానీ, పెద్ద వి ద్యా సంస్థలు మాత్రం నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. కొన్నిచోట్ల సీట్లు ఇచ్చినా, ఆ పిల్లలను ఇతర విద్యార్థుల నుంచి వేరుగా ఉంచి ‘వెలి’ వేయడం వంటి అమానుష సంఘటనలు జరగడం సమాజానికే సిగ్గుచేటు.
అభివృద్ధి చెందిన దేశాల్లో పీహెచ్‌డీ స్థాయి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. విద్యపై చేసే వ్యయాన్ని వారు ‘ఖర్చు ’గా కాకుండా, ‘పెట్టుబడి’గా భావిస్తారు. అందుకే అక్కడ సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలు వెల్లివిరుస్తున్నాయి. మన దేశంలో కనీసం 1 నుంచి 8వ తరగతి వరకు కూడా పేద పిల్లలకు ఉచిత విద్యను అందించలేకపోవడం ఆందోళనకరం.
విద్యా ప్రమాణాలేవి?
దేశమైనా, రాష్ట్రమైనా ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే నైపుణ్యం గల మానవ వనరులు కావాలి. అది విద్యతోనే ముడిపడి ఉంటుంది. పాఠశాల దశ నుంచే విద్యార్థులకు అందుతున్న నాణ్యమైన విద్యను బట్టే రేపు భవిష్యత్లో మానవ వనరుల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు విద్యను నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభుత్వం బడులను డెవలప్ చేయడంతోపాటు, విద్యా రంగ సమస్యలను పరిష్క రించాలి. టీచర్లు కూడా ఏకోన్ముఖ లక్ష్యంతో, జవాబుదారితనంతో పని చేయాలి. బోధనలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అను గుణంగా తగిన వృత్యంతర శిక్షణ ఉండాలి.
ఆ మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాలు ముం దడుగు వేయాలి. ప్రాథమిక తరగతులకు ప్ర తి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. ఉన్నత తరగతులకు సబ్జెక్టుకు కనీసం ఇద్దరు టీచర్లను నియమిస్తే విద్యా ప్రమాణాలు వికసిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయి స్తూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేయా లి. నిరంతర తనిఖీలు, పర్యవేక్షణ కోసం విద్యాధికారులను ఎప్పటికప్పుడు నియమించాలి. దేశ భవిష్యత్తును నిర్దేశించే పాఠశాల విద్యా వ్యవస్థలో లోపాలు, విద్యా ప్రమాణాల పతనం ఫలితాలు రేపటి సమాజాన్ని ప్రభావితం చేస్తాయి.
అందరికీ విద్య..
విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రత్యేక అరతలు గల విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు ప్రైవేటు యాజమాన్యాల కింద పనిచేసే విద్యాసంస్థలు వెనుకంజ వేస్తున్నాయి. బడ్జెట్ పాఠశాలలను మినహాయిస్తే ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్న కార్పొరేట్, ఇతర ప్రైవేటు విద్యా సంస్థలు చట్టాన్ని తుంగలో తొక్కడమేగాకుండా, ప్రశ్నించిన వారికి అడ్మిషన్లు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాయి.
ఈ వైఖరిలో మార్పు రావాల్సిన అవసరముంది. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు విద్యాహక్కు చట్టానికి తిరిగి ప్రాణం పోసేలా ఉన్నాయి. అన్ని స్థాయిల అధికారుల బాధ్యతను పెంచడంతో పాటు లోపాలు కనిపిస్తే తక్షణం నివారించే వ్యవస్థను ఏర్పాటు చే యాలని సూచించింది. పాఠశాల ప్రవేశాల ప్రక్రియలో ప్రభుత్వ జోక్యం పెరగాలని ఆదేశిం చింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ వి ద్యా దీవెన వంటి పథకాలను ప్రచార ఆర్భాటాలకే పరిమితం చేయకుండా, ప్రాథమిక స్థాయి నుంచే విద్యాహక్కును పక్కాగా అమ లు చేయాల్సిన అవసరముంది. విద్య అనేది కేవలం కొందరి సొత్తు కాకూడదు; అది అం దరి హక్కు. సుప్రీంకోర్టు సూచనల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించినప్పుడే అందరికీ విద్య అనే కల సాకారమవుతుంది.
సెల్: 9032042014