calender_icon.png 23 February, 2026 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను పాల్గొన్న ఉగాది కవి సమ్మేళనం

21-02-2026 12:00:00 AM

కోకిలల కుహూ రాగాలకు అప్పటిదాకా గళమెత్తని కవులు కూడా తమ గొంతుకలకు పని చెప్పడం ప్రారంభిస్తారు. నవ కవులు కొత్తగా కవితలను అల్లి వసంత ఋతువుకు సాదర స్వాగతం పలుకుతారు. పండుగవేళ  ఆరు రుచుల పచ్చడిని ఇష్టంగా ఆరగించని వారుండరు. ఉప్పు, కారం, వగరు, పులుపు, చేదు, తీపి అనే ఈ ఆరు రుచులు.. ఉగాది పచ్చడిని ఆస్వాదయోగ్యం చేస్తాయి. 

పూర్వం ఉగాది వచ్చిందంటే కవులకు పండుగ. నగరాల్లో కవి కోకిలలకు ఆహ్వానాలు పలికే సాహిత్య సంస్థలకు కూడా ఇది ఒక పండుగ లాగా ఉం టుంది. గ్రామాల్లోనూ కవితా పిపాస కలిగిన వారు నలుగురున్నా సమావేశమై కవితాగా నం చేయకుండా ఉండలేరన్న మాట వాస్తవమే. అయితే అది పూర్వకాలం పద్ధతి. యు గాది ‘ఉగాది’ అయ్యింది. కానీ ఈ పండుగ సృష్ట్యాదిని సూచిస్తుంది.

సూర్యుడు భూమ ధ్య రేఖ మీదికి వచ్చిన రోజునే ఉగాది పర్వదినంగా పిలుస్తారు. అదే ఉగాది రోజున శ్రీరాముడు తిరిగి అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడయ్యాడని చెప్పుకుంటారు. ఇక విక్రమార్కుడు సింహాసనాధిష్ఠుడైన రోజు కూడా ఉగాదే కావడం విశేషం. హిందూ త త్వవేత్త దయానంద సరస్వతి ‘ఆర్య సమాజాన్ని’ స్థాపించిన రోజు కూడా ఉగాదే కావడం గమనార్హం.

సృష్టి సమయం..

‘సంవత్సరం’ అంటే సృష్టి సమయం. కా లం లేకపోతే ఋతువులు, ఋతువులు లేకపోతే ప్రకృతిలో మార్పులు, మార్పులు లేక పోతే పంటలు, పంటలు లేకపోతే జీవకోటికి మనుగడ అన్నదే లేదు. చైత్రమాసంలో శుక్ల పక్షంలో పాడ్యమి నాడు సృష్టి మొదలైనట్లు జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ తిథిని పురస్కరించుకొని అనాదిగా మనం ఉగాది పం డుగను జరుపుకుంటూ వస్తున్నాం.

విశేషిం చి సమస్త ప్రాణకోటికి ఆహ్లదకరమైన రోజు మన ఉగాది. ప్రశాంతతకు ప్రతీక ఉగాది పండుగ. వసంతఋతువు కవి గాయకులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో అతి శయోక్తి లేదు. మోడు వారిన చెట్లను చిగురింపజేసినట్లే, మానవ జీవితంలో కొత్త కొత్త ఆశలను పుట్టిస్తుంది ఈ ఉగాది. పక్షుల కిలకిలారావాలతో, తుమ్మెదల ఝంకార ధ్వనులతో పూల తోటలు ప్రతిధ్వనించడం చూడముచ్చటగా ఉంటుందనడంలో సందేహం లేదు.

భిన్నమైన పచ్చడి..

కోకిలల కుహూ రాగాలకు అప్పటిదాకా గళమెత్తని కవులు కూడా తమ గొంతుకలకు పని చెప్పడం ప్రారంభిస్తారు. నవకవులు కొత్తగా కవితలను అల్లి వసంత ఋతువుకు సాదర స్వాగతం పలుకుతారు. పండుగవేళ ఆ రు రుచుల పచ్చడిని ఇష్టంగా ఆరగించని వారుండరు. ఉప్పు, కారం, వగరు, పులుపు, చేదు, తీపి అనే ఈ ఆరు రుచులు.. ఉగాది పచ్చడిని ఆస్వాదయోగ్యం చేస్తాయి.

ఈ ఆరు రుచులు ఒకదాని కంటె మరొకటి భి న్నంగా కనిపిస్తాయి కాబట్టే ఉగాది పచ్చడి అన్నింటిలోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నది. వివిధ మనస్తత్వాలు కల్గినవారు ధర్మ రక్షణలో ఏకం కావాలన్న దివ్య సందేశాన్ని ఇస్తున్నదే ఆరు రుచుల ఉగాది పచ్చడి! అందుకే పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. ఆధునిక జీవితంలో పచ్చడిలోను కొత్త రుచులు వచ్చి చేరుతున్నాయి. మహాకవి దాశరథి ‘అగ్నిధార’లో ‘ఉగాది’ గురించి రాస్తూ, ఆరు రుచుల్లో నాలుగు రు చులను గూర్చి చమత్కారంగా ఒక పద్యాన్ని చక్కగా వివరించారు.

‘వేపపూత చేత ఊపిరాడని గుడ

మధుర ధార తిక్తమై చెలంగె;

చింత గుజ్జులోన చిక్కిన పసిమావి

పిందెలందు ఒగరు మందగించె’

ఆలోచనాత్మకం..

పచ్చడిలో వేసిన వేపపూత వల్ల బెల్లం చేదయ్యిందట! అట్లే చింతపండు రసం వల్ల లేత మామిడి పిందెల్లో ఉన్న ఒగరు సన్నగిల్లిందట. ప్రత్యేకించి ఎవరైనా వేపాకును గాని, వేపపూతను గాని నోట్లో వేసుకుంటే అది ఎంత చేదుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి చేదుగల వేపపూత.. బెల్లం తీపిని ఊపిరాడకుండా చేస్తుం ది. చెడ్డవాడు మంచివాణ్ణి ఏమీ తోచకుండా చేయడం సహజమే కదా! ఐతే కొందరి వల్ల మన మనస్సు కొన్ని సమయాల్లో మారే అవకాశం కూడా ఉంటుంది. చింతపులుసు పులుపు గలది. అది వగరును బలహీనపరుస్తుందని కవి చెప్పిన విషయం ఆలోచనాత్మ కం అని చెప్పవచ్చు!

కవుల్లో ఉత్తేజం..

ప్రాచీన, అర్వాచీన కవులకు ఉగాది అనే ది ఒక గొప్ప పండుగ. వసంతం, చైత్రరథం, కోకిలల గానం, చెట్లు కొత్తగా చిగురించడం మొదలైన అంశాలు కవుల్లో ఎనలేని ఉత్తేజాన్ని కలిగిస్తాయనడంలో సందేహం లేదు. ఈ మధ్య ఉగాది సందర్భంగా రెండు కవి సమ్మేళనాలకు వెళ్లాను. అవి రెండు ప్రైవేటు కవి సమ్మేళనాలే గాని, ప్రభుత్వం ఏర్పాటు చేసినవి కావు. అయితే ప్రభుత్వ కవి సమ్మేళనంలో కవులు కులాన్ని బట్టి, వారికున్న బలాన్ని బట్టి అవకాశాన్ని పొందుతుంటారు.

కాని ప్రైవేటు కవి సమ్మేళనాలు అలాంటివి కావు. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వే తర సంస్థల ఆధ్వర్యంలో జరిగే కవి సమ్మేళనాల్లోనే అధికంగా ప్రేక్షకులు హాజరవుతుం టారు. ప్రతిభావంతులైనవారు ఏ కులానికి చెందినా, ఏ ప్రాంతానికి చెందినా, స్త్రీలుగాని, పురుషులుగాని కవి సమ్మేళనాల్లో పాల్గొనే అవకాశముంది.

రోడ్డుమీదే నిర్వహణ..

విచిత్రమేమంటే ‘దూరదర్శన్’ లాంటి సంస్థలు పెట్టే కవి సమ్మేళనాల్లో వేదికల మీ ద కవులే ఉంటారు గాని, వేదికలకు ఎదురుగా ప్రేక్షకులుండరు. ఎవరో నలుగురుంటే అదే గొప్ప అని చెప్పవచ్చు. మరొక విచిత్రం ఏమిటంటే ఈ కవి సమ్మేళనాల్లో కవిత్వం వినిపించేవారు తోడుగా ఒక నలుగురిని తీసుకొని రావాలని కోరడం. అయితే ఉగాది నాడు పండుగను విడిచి కవుల వెంట వచ్చే కవితాపిపాసకులెవ  రుంటారు చెప్పండి? అయితే సిటీలోని గడ్డి అన్నారంలో నిర్వాహకులు రోడ్డు మీదనే ఒకసారి ఉగాది కవి స మ్మేళనం జరిపారు. ఆ కవి సమ్మేళనానికి ఎంతోమంది ప్రేక్షకులు రావడం నన్ను ఆశ్చర్యపరిచింది.

అంతేకాదు కవి సమ్మేళనం అయిపోయే దాకా పాల్గొన్న కవులే కాదు, వీ క్షించిన ప్రేక్షకులు కూడా అలాగే చూస్తూ ఉండిపోవడం గమనార్హం. ఈ సందర్భంగా ఒకమాట చెప్పక తప్పదు. ఉగాది రోజు ఏదో ఒక కవి సమ్మేళనంలో పాల్గొనకపోతే నా మనస్సు ఎంతమాత్రం ససేమిరా ఒప్పుకోదు. అయితే రాబోయే ఉగాది నాడు జరి గే కవి సమ్మేళనానికి నన్ను ఎవరు పిలుస్తా రో చూడాలి. ఆ క్షణం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాను.

 వ్యాసకర్త సెల్: 9885654381