calender_icon.png 21 February, 2026 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాతృభాషల ఉనికిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరి పైన ఉంది

21-02-2026 06:13:39 PM

దేవరకొండ,(విజయ క్రాంతి): దేవరకొండ పట్టణంలోని మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వ), అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమావత్ రవి మాట్లాడుతూ మాతృభాషల ఉనికిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరి పైన ఉందని, మన సంస్కృతి, సంప్రదాయాలు మాతృభాషతో పెరవేసుకుని ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగాధిపతి జి.కోటయ్య, అధ్యాపకులు అద్దంకి శ్రీను, పొలిటికల్ సైన్స్ విభాగం అధ్యాపకులు కె.నాగరాజు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.