calender_icon.png 21 February, 2026 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ లో ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ

21-02-2026 06:19:56 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఐదు రోజులపాటు నిర్వహించిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. మొదటి బ్యాచ్లో 14 గ్రామాల కు చెందిన 122 మంది వార్డు సభ్యులు ఐదు రోజులపాటు ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరు అయినారు. ఈ శిక్షణా కార్యక్రమంలోగ్రామపంచాయతీకి సంబంధించిన విధులు గ్రామపంచాయతీకి వచ్చే నిధులు వార్డు సభ్యుల బాధ్యతలు మొదలగు విషయాలపై సమగ్రంగా శిక్షణ ఇవ్వడం జరిగింది.

చివరి రోజు ముఖ్య అతిథిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి దివ్యదర్శన్ రావు  హాజరు అయినారు. ఈ సందర్భంగా ఎంపీడీవో  మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో తెలుసుకున్న విషయాలన్నింటినీ గ్రామాల అభివృద్ధి కొరకు వార్డు సభ్యులు ఉపయోగించాలని గ్రామపంచాయతీ పాలనలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వము నుండి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి పేద వ్యక్తికి అందేలా వార్డు సభ్యుల బాధ్యత తీసుకోవాలని సూచించారు.

గ్రామాల అభివృద్ధి తోనే దేశం అభివృద్ధి చెందుతుందని గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని, గ్రామంలోని ప్రతి వార్డులో ఉన్న సమస్యలు గ్రామపంచాయతీ గ్రామసభలో చర్చించి పరిష్కారం చూపాలని తెలిపారు.  శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా శిక్షణకు హాజరైన వార్డు సభ్యులను, ఉపసర్పంచులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి  ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి మౌనిక , కాట్నపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఓగుల పూజ , శిక్షకులు సాగర్, రణధీర్, శివ, సురేష్ , సంబంధిత గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.