24 July, 2026 | 1:38 AM

ఉత్సాహంగా నవోదయ ప్రాంతీయ స్థాయి ఫుట్‌బాల్ ఎంపికలు

24-07-2026 12:26 AM

రేపు విజేతల ప్రకటన.. జాతీయ స్థాయికి 80 మంది ఎంపిక

గజ్వేల్, జూలై 23: సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో జరుగుతున్న నవోదయ విద్యాలయ సమితి ప్రాంతీయ స్థాయి ఫుట్బాల్ ఎంపికలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయని ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు. గురువారం అండర్-14, అండర్-17, అండర్-19 బాలుర ఎంపికలు దాదాపు పూర్తికాగా, సాయంత్రం నుంచి అండర్-17, అండర్-19 బాలికల ఎంపికలు నిర్వహించారు. ఎస్కార్ట్ టీచర్లు, అధ్యాపకులు, విద్యార్థుల కేరింతలు, చప్పట్ల మధ్య పోటీలు ఉత్సాహంగా సాగాయి.

శుక్రవారం ఉదయం 10 గంటలకు ముగింపు కార్యక్రమంలో అన్ని విభాగాల్లో ఎంపికైన క్రీడాకారుల వివరాలను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఎంపీ హాల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రతి విభాగంలో 16 మంది చొప్పున మొత్తం 80 మంది క్రీడాకారులను ఆగస్టులో అస్సాంలో జరిగే నవోదయ విద్యాలయ సమితి జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక చేయనున్నారు. బాలికల విభాగంలో అండర్-14 కేటగిరీ లేదని ప్రిన్సిపాల్ తెలిపారు.