20 ఏళ్ల మొక్కు తీర్చుకున్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్
24-07-2026 12:24 AM
సదాశివపేట, జూలై 23: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని మాత ఆలయంలో సదాశివపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ గురువారం తన 20 సంవత్సరాల నాటి మొక్కును భక్తిశ్రద్ధలతో తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.
ఈ కార్యక్రమంలో సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, కౌన్సిలర్లు కొవ్వూరు శంకర్ గౌడ్, తుల్జారం, కాంగ్రెస్ నాయకులు గంప కృష్ణ, ఓదెల రవీందర్, గాండ్ల రమేష్, చోటు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.






