2 August, 2026 | 11:19 AM

​సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్

02-08-2026 09:58 AM

₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం

కొత్తగూడెం, ఆగస్టు 1(విజయక్రాంతి): సర్వారం గ్రామపంచాయతీ పరిధిలోని గోప తండా శివారు, రైల్వే ట్రాక్ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న స్థావరంపై సీసీఎస్ (CCS) సిబ్బంది మరియు సుజాతనగర్ పోలీసులు ఉమ్మడిగా దాడి చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు నిర్వహించిన ఈ దాడిలో ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. 

వారి వద్ద నుంచి ₹52,100 నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 5 స్మార్ట్ ఫోన్లు మరియు పేకముక్కలను స్వాధీనం (సీజ్) చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చట్టవ్యతిరేకమైన పేకాట, జూదం లాంటి కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ  సందర్భంగా సుజాతనగర్ ఎస్సై రమాదేవి హెచ్చరించారు.

​పట్టుబడిన నిందితుల వివరాలు

1.​నునావత్ సంతోష్

2.​భూక్య బిక్కులాల్

3.​నున్సావత్ అశోక్ కుమార్

4.​చల్ల రాజు

5.​భూక్య వీరన్న

6.​ఇస్లావత్ ప్రవీణ్ కుమార్

పరారీలో ఉన్న నిందితులు

1.​కున్సోత్ వంశీ

2.​భూక్య ప్రవీణ్

3.​పల్లపు చంటి

4.​బానోత్ గోపి

5.​ధరావత్ రాజ్ కుమార్.