2 August, 2026 | 11:19 AM

వర్షాలకు కూలిన ఇల్లుతో అధైర్యపడొద్దు

02-08-2026 10:05 AM

బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది 

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజు 

ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లె గ్రామంలో మొన్న కురిసిన వర్షాలకు  మహమ్మద్ లాల్ బి ఇల్లు కూలిపోవడం జరిగింది. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజ్జల రాజు పార్టీ నాయకులతో కలిసి బాధితులతో మాట్లాడి  ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు.

ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ బాధితుల పరిస్థితి సిరిసిల్ల ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డికి తెలియజేశామని పేర్కొన్నారు.వారు స్పందించి అధికారులతో వెంటనే మాట్లాడడం జరిగిందని తెలిపారు. ఇందిరమ్మ గృహ పథకం ద్వారా కట్టుకోవడానికి వెంటనే బాధిత కుటుంబానికి ఇల్లు మంజూరు చేయిస్తామని తెల్పినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి,మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ , నాయకులు భాను,మహేష్, శంకర్,రాజానర్సు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.