2 August, 2026 | 11:18 AM

భోజనం వికటించి 7 విద్యార్థుల అస్వస్థత

02-08-2026 10:07 AM

- గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఘటన 

- ఉపాధ్యాయురాలు అస్వస్థత

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మరో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన కలకలం రేపింది. ఇటీవలనే  మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో 24 మంది విద్యార్థినిలు భోజనం వికటించి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన మరువకముందే గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన ఆందోళన కలిగిస్తుంది. మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేసిన అనంతరం వాంతులు చేసుకున్నారు. ఈ సంఘటనలో 7 గురు విద్యార్థులు, ఉపాధ్యాయురాలు కూడా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భోజనం వికటించడానికి కారణాలు తెలియాల్సి ఉంది.