24 August, 2026 | 10:27 AM

తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

24-08-2026 09:20 AM

హైదరాబాద్ లో రాబోయే 2 గంటల్లో వర్షం

హైదరాబాద్: నగరంలో నిన్న సాయంత్రం నుంచి వర్షం(heavy rains) కురుస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) ప్రకటించింది. సోమవారం నాడు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతంగా ఉండనుంది. హైదరాబాద్ లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రేపు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. భారీ వర్షాల నేపధ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

రాగల రెండు మూడు గంటల్లో భారీ వర్షాలు

ఇప్పటికే జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో రాగల 2, 3 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, నాగర్‌కర్నూల్‌, ములుగులో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోని పటాన్‌చెరు, లింగంపల్లి, ఆర్‌సీ పురం, మియాపూర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, కుత్బుల్లాపూర్, గాజులరామారం, నిజాంపేట్, హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ, మాదాపూర్, ఖైరతాబాద్, షేక్‌పేట్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, అల్వాల్ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.