ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
24-08-2026 08:46 AM
ముస్తఫా నగర్ లో విషాదం..
గంభీరావుపేట,ఆగస్టు 24 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్ గ్రామానికి చెందిన చిలుక లింగం (50) ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం సాయంత్రం వెలుగుచూసింది. పోలీసులు,కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, కుమార్తె వివాహానికి చేసిన అప్పులు, కుమారుడు నిరుద్యోగం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన లింగం గ్రామ శివారులో మర్రి చెట్టుకు తాడుతో ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య దేవవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.






