5 August, 2026 | 5:55 PM

తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ

05-08-2026 04:49 PM

* వైస్ ఛైర్పర్సన్ మేడిశెట్టి ఉమా శ్రీధర్

చేర్యాల: జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా చేర్యాల 6వ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ మేడిశెట్టి ఉమా శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నవజాత శిశువుకు జనం అనంతరం వెంటనే ముర్రుపాలు పట్టించడం అత్యంత అవసరమని అన్నారు.

ముర్రుపాలు శిశువుకు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తాయని తెలిపారు.ప్రతి తల్లి మొదటి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత తల్లిపాలతో పాటు పౌష్టికాహారం అందించాలని సూచించారు.కార్యక్రమంలో గర్భిణీ మహిళలకు శ్రీమంతం, ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు.