సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాల్లో.. నేషనల్ టాపర్‌గా నారాయణ స్కూల్స్!
హైదరాబాద్, ఏప్రిల్ 16(విజయక్రాంతి): సీబీఎస్‌ఈ ఫలితాలలో మరోమారు నారాయణ జైత్రయాత్ర కొనసా గింది. అత్యుత్తమ మార్కులతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. 10వ తరగతిలో 500 మార్కులకు గాను 499( రిద్ది శర్మ, హెచ్‌టీ నెం.13201196,పంజాబ్),498(నైతిక్ దంగి, హెచ్‌టీ నెం.12197644, వెస్ట్ బెంగాల్), 498( సానా సమీర్‌గౌడ్ హెచ్‌టీ నెం. 15145554, మహారాష్ట్ర), 498(బైజయంతి బెనర్జీ, హెచ్‌టీ నెం.12190276, వెస్ట్ బెంగాల్), 498(బి.సంజనారెడ్డి, హెచ్‌టీ నెం.18115692, కర్ణాటక),498(మోహిప్ బోస్,హెచ్‌టీ నెం.12189216, వెస్ట్ బెంగాల్), 498(ఎ.సజీవన్, హెచ్‌టీ నెం. 18137633, కర్ణాటక) వంటి టాప్ మార్కులతో సంచలనం సృష్టించారని నారాయణ విద్యా సంస్థలు డైరెక్టర్స్ డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు.
ఈ సందర్భంగా ఫలితాలను విశ్లేషిస్తూ 10వ తరగతిలో 499 మార్కులు సాధించిన వారు ఒక్కరు కాగా, 498 ఆపైన మార్కులు సాధించినవారు 7గురు, 497 ఆపైన మార్కులు సాధించిన వారు 19 మంది, 496 ఆపైన మార్కులు సాధించిన వారు 30 మంది, 495 ఆపైన మార్కులు సాధించిన వారు 47 మంది వీరితో పాటుగా 210 మంది విద్యార్థులు 490 ఆపైగా మార్కులను,886 మంది విద్యార్థులు 480 ఆపైగా మార్కులు, 1848 మంది విద్యార్థులు 470 ఆపైగా మార్కులు,2808 మంది విద్యార్థులు 460ఆపైగా మార్కులు, 3732 మంది విద్యార్థులు 450 ఆపైగా మార్కులు సాధించారు. ఓవరాల్ పాస్ పర్సంటేజ్ 99.6%గా ఉందన్నారు. దాదాపు 161 బ్రాంచీలలో 100% ఫలితాలు సాధించినట్లు తెలిపారు. పరీక్ష ఏదైనా నారాయణ విజయపరంపర కొనసాగుతోందన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ పి.సిధూర నారాయణ మాట్లాడుతూ ఈ రికార్డును 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా సాధించినట్లు చెప్పారు. ఈ స్థాయి ఫలితాలు మరి ఏ ఇతర విద్యా సంస్థ సాధించలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ఒడిస్సా, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లోని అత్యధిక బ్రాంచీలలో 100% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. టాప్ మార్కులు కానీ, సబ్జెక్టుల వారీగా కానీ, నూటికి నూరు శాతం మార్కులలో కాని అత్యధిక సంఖ్యలో ఫలితాలు సాధించడం నారాయణ స్కూల్స్‌కు ఆనవాయితీగా కొనసాగుతందన్నారు.
పి.శరణి నారాయణ మాట్లాడుతూ ఈ ఫలితాలు నారాయణ పటిష్ట ప్రణాళికకు, ఉపాధ్యాయుల అకుంఠిత దీక్షకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అయిన సిఓ ఒలింపియాడ్, ఈ మెడిస్పార్క్ ప్రోగ్రామ్స్‌తో బోధన చేయటం కారణంగానే ఘన విజయాలను కైవశం చేసుకున్నట్లు తెలిపారు. అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయుల వలనే అద్భుత విజయాలు సాధిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ కె.పునీత్ ప్రత్యేకంగా అభినందించారు.






