రేపటి నుంచి నృసింహ జయంతి ఉత్సవాలు
ఈ నెల 30 వరకు వైభవంగా నిర్వహణ
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు ఐదు రోజులపాటు స్వామి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందు కు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని ఆలయ ఈవో భవాని శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
అలాగే స్వామివారి అనుబంధ ఆలయాలైన పాతగుట్ట,దబ్బగుంటపల్లి ఆలయాల్లో కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసున్నామన్నారు. స్వామి వారి ప్రధాన ఆలయము నందు శ్రీ పాంచరాత్ర ఆగమానుసరంగా పాంచాహ్నిక పంచకుండాత్మక సృసింహ జయంతి ఉత్సవాలు అత్యం త వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ జయంతి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూ లల నుండి భారీ సంఖ్యలో భక్తులు రానివ్వడంతో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.






