14 July, 2026 | 6:52 PM

Breaking News

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •  

తెలంగాణ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్, డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు

01-02-2026 05:17 PM

కాకతీయ యూనివర్సిటీ,(విజయక్రాంతి): హైదరాబాదులోని తెలంగాణ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్  అండ్ సీడ్స్, డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు నీలగిరి హనుమంతరావు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  తెలంగాణ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్  అండ్ సీడ్స్, డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రామడుగు మనోహర్, రాష్ట్ర కోశాధికారిగా సిద్ధి నాగరాజు  లను రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి నాగుర్ల వెంకటేశ్వర్లుకు, నూతన కార్యవర్గానికి డీలర్స్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రైతుల మరియు డీలర్ల సంక్షేమము అభివృద్ధి ద్యేయంగా పనిచేస్తానని,  రైతులకు సకాలంలో నాణ్యమైనటువంటి విత్తనాలు,ఎరువులు, పురుగు మందులు అందే విధంగా కృషి చేస్తానని అన్నారు.

తనపై నమ్మకం ఉంచి తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి డీలర్స్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అసోసియేషన్ నుండి రవీందర్ రెడ్డి, మల్లేశం, జలంధర్, వరంగల్ నుండి సత్యనారాయణ రెడ్డి, కేదారి, నాగరాజు, రాజేందర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఖమ్మం నుండి రాంబ్రహ్మం, నాగేశ్వరరావు, నాగేందర్, హైదరాబాద్ నుండి మునాఫ్, వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున డీలర్స్  తో పాటు తదితరులు పాల్గొన్నారు.