9 May, 2026 | 2:20 PM

Breaking News

ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000 సాయం   •   మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •  

కోటగుళ్ళకు రూ.80 వేలతో నాగేంద్ర సహిత అర్ధనారీశ్వర తొడుగు బహుకరణ

14-02-2026 12:31 AM

గణపురం, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి):ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ కు ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన తౌటిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వర్ణలత దంపతులు 80 వేలు వెచ్చించి నాగేంద్ర సహిత అర్ధనారీశ్వర తొడుగును శుక్రవారం బహుకరించారు.

ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి స్వర్ణలత దంపతులు స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలను సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.