2 July, 2026 | 11:57 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

మైథిలీ ఠాకూర్ పాట ప్రత్యేకం

15-11-2025 01:49 AM

అలీనగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం

పాట్న, నవంబర్ 14:  ఎన్డీయే కూటమి భారీగెలుపునకు ప్రముఖ యువ సింగర్, బీజేపీ అబ్యర్థి మైథిలీఠాకూర్ పాట ‘ఓ రాజాజీ’ కూడా ఓ ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఎన్నకల ప్రచారంలో ఆమె పాట బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతూ ఓటర్లను అమితంగా ఆకర్షించింది. ఆమె ఆలీనగర్  నుంచి పోటీ చేసింది. 25 ఏళ్ల బీజేపీ అభ్యర్థి, జానపదగాయని మైథిలి ఠాకూర్ అలీనగర్‌లో 11,700 కంటే ఎక్కువ ఓట్లతో గెలిచారు.

ఆర్జేడీ సీనియర్ నాయకుడు బినోద్ మిశ్రాను ఓడించి, బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన అతిచిన్న వయసులో ఎమ్మెల్యేగా నిలిచారు. ప్రముఖ జానపద గాయని, తొలిసారి అభ్యర్థిగా ఎన్నికైన ఆమె 63 ఏళ్ల బినోద్ మిశ్రాను ఓడించారు. తాను గెలిస్తే అలీనగర్ నియోజకవర్గం పేరును మారుస్తానని కూడా మైథిలీ హామీ ఇచ్చారు.