ఫిన్లాండ్‌లో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్.. ఇంకా వీడని మిస్టరీ
హైదరాబాద్: ఫిన్లాండ్‌లో తెలంగాణ విద్యార్థి(Telangana student missing) అదృశ్యంపై మిస్టరీ వీడలేదు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిన్లాండ్‌లో(Finland) 45 రోజుల క్రితం మణిదీప్ రెడ్డి మిస్సింగ్ అయ్యాడు. వనస్థలిపురం వాసి అయిన మణిదీప్ రెడ్డి ఫిన్లాండ్ లోని లాతీసిటీలో(Finland Lahti City) చదువుతున్నాడు. మే 5 నుంచి కుటుంబసభ్యుల ఫోన్ కు మణిదీప్ రెడ్డి స్పందించలేదు. ఫిన్లాండ్ లో మణిదీప్ రెడ్డి అదృశ్యంపై కేసు నమోదు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కుమారుడి ఆచూకీ కోసం హైదరాబాద్ లోని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిన్లాండ్ వెళ్లేందుకు తల్లిదండ్రులు చేసిన వీసా దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. ఫిన్‌లాండ్‌లో మే 6 నుండి అదృశ్యమైన తన కుమారుడు గుజ్జ మణిదీప్ రెడ్డి ఆచూకీని కనుగొనేందుకు సమర్థవంతమైన దౌత్యపరమైన, పరిపాలనాపరమైన చర్యలు చేపట్టేలా ఆదేశాలు కోరుతూ ఒక గృహిణి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశారు.






