సికిల్ సెల్ దినోత్సవ అవగాహన ర్యాలీ
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్ర వారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్ మాట్లాడుతూ సికిల్ సెల్ వంశపారపర్యంగా సోకుతుందన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించిన ఈ ర్యాలీలో ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ శ్రీధర్, సికిల్ సెల్ తలసేమియా జిల్లా కార్యవర్గం కాసర్ల శ్రీనివాస్, చుంచు శంకర వర్మ, అవినాష్, కంకణాల భాస్కర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, నామ్ దేవ్, కాకినాడ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, పుట్ట సత్తయ్య, వైద్యాధికారులు వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






