19 June, 2026 | 12:24 PM

Breaking News

రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు   •   ఫాస్ట్ ఫుడ్ లవర్స్ జర భద్రం... గోదాంలో దొరికిన రంగులు, కుళ్లిన చికెన్   •   సికిల్ సెల్ దినోత్సవ అవగాహన ర్యాలీ   •   లో లెవల్ బ్రిడ్జిపై హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలి   •   రామన్నగూడెం ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు   •   టెలిగ్రామ్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు   •   ఫిన్లాండ్‌లో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్‌.. ఇంకా వీడని మిస్టరీ   •   అగ్రహారంలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య   •   పేరుకే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం   •   సింగరేణిలో ఐదో రోజు కవిత బాయిబాట కార్యక్రమం   •  

లో లెవల్ బ్రిడ్జిపై హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలి

19-06-2026 11:26 AM

రైతు కూలీ సంఘం(ఆర్సీఎస్) డిమాండ్

గుండాల, (విజయక్రాంతి): ప్రజల రవాణా సౌకర్యర్థంలో భాగంగా ఏడు మెళకల వాగు లో లెవల్ బ్రిడ్జి శిథిలావస్థలో ఉందని, ప్రభుత్వం తక్షణమే ఈ బ్రిడ్జిని పునరుద్ధరించాలని రైతు కూలీ సంఘం(ఆర్సీఎస్) డిమాండ్ చేసింది. రైతు కూలీ సంఘం(ఆర్సీఎస్) నాయకులు మాట్లాడుతూ...కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం ప్రజల రవాణా సౌకర్యార్థం లో లెవల్ బ్రిడ్జిని తక్షణమే నిర్మించాలని, బ్రిడ్జి కృంగడం వల్ల ప్రజలకు రవాణా సౌకర్యం అసౌకర్యంగా మారిందని అన్నారు.

ప్రజల ఇక్కట్లను, బాధలను స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు విస్మరించారని అనడంలో సందేహం లేదని, కేవలం ప్రజలను ఓట్ల పెట్టెలోనే చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలలో ప్రభుత్వాలు ఇచ్చిన ఏ హామీ కూడా కాగితాలను దాటి బయటికి రాలేదని, గుండాల ప్రాంతంలో ప్రజల ప్రజల అవసరార్థం గతంలో నిర్మించిన ఈ బ్రిడ్జిని పునర్నిర్మానం చేయకపోతే రైతు కూలీ సంఘం మరియు ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయ దిగ్బంధనం చేస్తామని రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోకాళ్ళ సమ్మయ్య మరియు ఏఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోల్ల అంజయ్య లు హెచ్చరించారు. ఏడు మెళకల వాగుపై ఉన్న లో లెవెల్ బ్రిడ్జి వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సత్యం, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.