రామన్నగూడెం ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు
- హైదరాబాదులో పనిచేయని పదుల మంది పేర్లు నమోదు.
- వేల రూపాయలు.. పని చేయని వారికి బిల్లులు అప్పగింత.
- గుగులోతు రమేష్ ను సస్పెండ్ చేయాలని ఉపాధి కూలీల డిమాండ్.
తుంగతుర్తి,(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా పేద ప్రజల ప్రయోజనాల దృష్ట 100 రోజులు ఉపాధి పనులు(Employment Guarantee Scheme works) కల్పించి, ఆర్థికంగా కుటుంబాలను బలోపేతం చేయాలని లక్ష్యముతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండా గ్రామపంచాయతీలో పనులు కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా గ్రామానికి చెందిన మేటు, ఫీల్డ్ అసిస్టెంట్ గుగులోతు రమేష్ నాయక్ 40 రోజుల నుండి 120 మందికి పనులు నిర్వర్తించగా 80 మంది మాత్రమే పనులు కల్పించారు.
మిగతా 40 మందికి పనులు చేయగా, వర్క్ షీట్లో డిలీట్ అయింది అని చెప్పి, బిల్లులు కొట్టకపోగా డబ్బులు రాలేదు అని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా తండాకు చెందిన సుమారు 40 మంది గిరిజనులు హైదరాబాదులో పొట్టకూటి కోసం వెళ్లగా, వారు ఇక్కడికి వచ్చి పనులు చేయకున్నా, ఫోన్లో వీడియో కాల్ చేసి, ఫేస్ రికగ్ని చేసుకొని సదరు రమేష్ నాయక్ హాజరు చేస్తున్నట్లు పలువురు ఆరోపించారు. దీనితో ప్రభుత్వ సొమ్ము వేలాది రూపాయలు నష్టం వాటిల్లుతున్నది. మండలంలో ఏ ఒక్క అధికారి కూడా కనీసం పర్యవేక్షణ చేయనట్లు కూలీలు వాపోతున్నారు. కావున జిల్లా కలెక్టర్ తక్షణమే జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో జిల్లా అధికారులతో విచారణ జరిపి, ఉపాధి కూలీలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఉపాధి పనుల పై ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ నాయక్ వివరణ.
గడిచిన 40 రోజుల నుండి రామన్న గూడెం గ్రామపంచాయతీ శివారులో గల చెరువు కట్టవద్ద, 120 మంది కూలీలు పనులు చేస్తున్నారు. వీరిలో 40 మంది పనులు చేసినప్పటికీ వర్క్ పనులు డిలీట్ అయ్యాయి. తిరిగి వారికి మండల అధికారుల ద్వారా, బిల్లులు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాము. హైదరాబాదులో పనిచేయని 4గురు మాత్రం, పనిచేయకున్నా పని కల్పించినట్లు, హాజరు వేశాను. ఇది ఒకటే తప్పు చేశాను. గత కొంతకాలంగా జీతం లేకుండా పనిచేస్తున్నట్లు రమేష్ నాయక్ పేర్కొన్నారు..






