లిమ్కా రికార్డ్స్ వేదికపై మెరిసిన మీసాల జతీష్
నాగోల్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): మార్షల్ ఆరట్స్ రంగంలో మరో మైలురాయిని నమోదు చేస్తూ లయన్ గోజు ర్యూ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగవ వార్షిక లిమ్కా బుక్ ఆఫ్ రికారడ్స్ కార్యక్రమంలో చైతన్యపురి మీసాల జతీష్ అద్భుత విజయాన్ని సాధించాడు.
లయన్ గోజు ర్యూ కరాటే అకాడమీలో శిక్షణ పొందుతున్న జతీష్ తన కరాటే నైపుణ్యాలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాడు. అతని ప్రతిభకు హాజరైన వారు విశేషంగా ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, స్టంట్ మాస్టర్స్ బద్రి (డేర్ డెవిల్), కృష్ణ చేతుల మీదుగా జతీష్కు లిమ్కా బుక్ ఆఫ్ రికారడ్స్ సర్టిఫికెట్ను ప్రదానం చేశారు. కోచ్ కే. మహేష్ నాయక్ జతీష్ ప్రతిభను కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.






