10 June, 2026 | 2:40 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

జేఈఈ మెయిన్స్ రాసే ముస్లింలు ఈడబ్ల్యూఎస్ కోటాను సద్వినియోగం చేసుకోవాలి

01-11-2025 08:42 PM

మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా

కొత్తగూడెం,(విజయక్రాంతి): జనవరి -2026లో జరగనున్న జేఈఈ మెయిన్స్ కు హాజరయ్యే ముస్లిం విద్యార్ధులందరూ ఈడబ్ల్యూఎస్ కోటాలో దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ. యాకూబ్ పాషా శనివారం  ఒక ప్రకటన లో తెలిపారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల అయినందున ఈడబ్ల్యూఎస్ కోటాలో దరఖాస్తు చేసుకున్నట్లైతే 10 శాతం రిజర్వేషన్లు పొందే అవకాశం ఉంటుందన్నారు.

కావున ముస్లిం విద్యార్దులు తమ సమీప మీ-సేవ కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కొరకు ఆన్‌లైన్‌ చేసుకోవాలని కోరారు.  జేఈఈ మేయిన్స్ కు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 27 వరకు  ఉన్నందున విధ్యార్దులు వెంటనే  ఈడబ్ల్యూఎస్  సర్టిఫికెట్ ఈ- సేవా కేంద్రాలలో పొందాలన్నారు. ఈడబ్ల్యూఎస్  సర్టిఫికెట్ పొందే క్రమంలో తహశీల్దార్ లు ఇబ్బందులు పెడితే 8520860785 నంబరుకు సంప్రదించాలని సూచించారు.