4 March, 2026 | 12:33 AM

రంజాన్ మాసం ముస్లింలకు పవిత్రమైంది

03-03-2026 09:30 PM

అన్నారం సర్పంచ్ కుంచాల శ్రీనివాసరెడ్డి

తుంగతుర్తి,(విజయక్రాంతి): అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి మంగమ్మ దంపతుల ఆధ్వర్యంలో మంగళవారం పవిత్ర రంజాన్ మాస సందర్భంగా హిందూ ముస్లిం  సోదర భావానికి, సమైక్యతకు, నిదర్శనంగా  గ్రామ ముస్లిం సోదరులకు తన స్వగృహంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందుకు ముస్లిం సోదరులు  గ్రామ ప్రజలకు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కలగాలని అల్లా దయ గ్రామ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఇఫ్తార్ విందులో గ్రామ ముస్లిం సోదరులు పాల్గొనడం జరిగిందని ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దొంగరి శ్రీనివాస్ ,మాజీ సర్పంచ్ చిత్తలూరి సోమశేఖర్, సీనియర్ నాయకులు తన్నీరు యాదగిరి, ముస్లిం సోదరులు ఆఫీజ్ ఇలియాజ్, మహమ్మద్ సిద్ధిక్ , అహ్మద్ హుస్సేన్, షేక్ లతీఫ్, షేక్ నభీ, షేక్ జానీ, షేక్ యాకూబ్, షేక్ షాబుద్దీన్, షేక్ మహమ్మద్, షేక్ మాల్సూర్, షేక్ లతీఫ్, మైబెల్లి మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం ఉప సర్పంచ్ సరిత, బింగి వెంకటేశ్వర్లు, బల్లెం ప్రవీణ్, మరియు బంధు కృష్ణమూర్తి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.