6 May, 2026 | 7:16 PM

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వద్దు

06-05-2026 06:25 PM

ఐకెపి కేంద్రం వద్ద డిసిసి చీఫ్, శివసేన రెడ్డి రైతులు మొర...

రైతుల కోసం వెంటనే స్పందించి కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కారం

అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు

వనపర్తి  జిల్లా డిసిసి చీఫ్ , రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి

వనపర్తి,(విజయక్రాంతి): ప్రజాపాలన ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తుందని, రైతులకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవలసిన బాధ్యత అధికారులకు ఉందని, వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని డిసిసి చీఫ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో ఐకెపి సెంటర్లు ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని రైతులు పిలవడంతో ఆయన సందర్శించారు.

ఐకెపి సెంటర్లు నిర్వహణ తీరును పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఐకెపి , మెప్మా, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే దళారులు తరువు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని రైతులు విన్నవించడంతో వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో చరవాణిలో మాట్లాడి పలు సమస్యలను వివరించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చిన్నచిన్న పొరపాట్లు ఉంటే వెంటనే సరి చేయాలని అధికారులకు ఆయన సూచించారు.

ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా పనిచేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు, టెంటు, తేమ శాతానికి సంబంధించిన పరికరాలు , వర్షం వస్తే ధాన్యం తడవకుండా ముందస్తు ప్రణాళికలతో కొనుగోలు కేంద్రాల నిర్వహకులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట ఆ గ్రామ సర్పంచ్ పుష్పలత శివకుమార్, ఉపసర్పంచ్ పోల్లికమ్మ, రైతులు, పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.