6 May, 2026 | 7:22 PM

డీఎస్పీని కలిసిన బిఆర్ఎస్ నాయకులు

06-05-2026 06:31 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బి. అశోక్ ను బుధవారం ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీ బీన్ అహ్మద్ , బి ఆర్ ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లతో కలిసి డీఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలకృష్ణ, సాలం బీన్ అహ్మద్, మాజీ సర్పంచ్ బలరాం నాయక్, బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ నిసార్, సాయి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.