7 March, 2026 | 12:24 PM

మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

06-03-2026 06:55 PM

సిఐటియు జిల్లా నాయకులు అల్లీ దేవేందర్, సిహెచ్.ప్రవీణ్ కుమార్

మొయినాబాద్,(విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపల్ కార్మికులకు రెండు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్, సిఐటియు జిల్లా నాయకులు అల్లీ దేవేందర్, సిహెచ్.ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొయినాబాద్ పురపాలక సంఘంలో కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, మొయినాబాద్ పురపాలక సంఘానికి మంచి పేరు రావడం కోసం పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ.. అనారోగ్యలపాలైన కార్మికులు పనిచేస్తున్నారని, కానీ మున్సిపల్ అధికారులు వారి సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమవుతున్నారని అన్నారు. కార్మికులకు ప్రతినెల 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని తెలిపారు. మొయినాబాద్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంగా కార్మికులు రెండు నెలల నుంచి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి కార్మికులకు రెండు నెలల పెండింగ్ వేతనాలతో పాటు సబ్బులు, నూనెలు, ఈఎస్ఐ కార్డు, పిఎఫ్ నంబర్, షూస్, గ్లోజులు, నూతన యూనిఫార్మ్స్ ఇవ్వాలని మున్సిపల్ అధికారులను వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన తీవ్రం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు గౌరవాధ్యక్షులు రత్నం, అధ్యక్షులు సుధాకర్, ప్రధాన కార్యదర్శి సురేష్, కోశాధికారి కృష్ణ, ఉపాధ్యక్షులు కృష్ణ, జగన్, నరసింహ, శ్రీకాంత్, రాజు, చెన్నయ్య, నరసింహ, వాటర్ మెన్స్, ఎలక్ట్రీషన్లు, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.