7 March, 2026 | 1:41 PM

అంగన్వాడి కేంద్రంలో గర్భవతులకు సీమంతం

06-03-2026 06:57 PM

మొయినాబాద్,(విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్ లోగల రెండవ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం గర్భిణి స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు బాలింతలకు తల్లులకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పౌష్టిక ఆహారం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీలత, రోజ్మేరీ, మాణేమ్మ, ఏఎన్ఎం ఝాన్సీరాణి, హై స్కూల్ చైర్ పర్సన్ మహేశ్వరి, ఆశావర్కర్లు సుకీర్త, సరిత, అంగన్వాడీ టీచర్లు కవిత, అమ, రజిని, తదితరులు పాల్గొన్నారు.