7 March, 2026 | 10:14 AM

విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిని కలిసిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు

06-03-2026 06:52 PM

కుమ్రంభీం అసిఫాబాద్,(విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ ధోత్రే  ను ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన పబ్లిక్ స్కూల్స్‌ను ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కోరారు. 

నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.స్పందించిన విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ ధోత్రే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నందున విద్యాభివృద్ధి, పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.