24 March, 2026 | 3:11 PM

ఎంపీ ‘వేం’ను సన్మానించిన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దంపతులు

24-03-2026 12:08 AM

కేసముద్రం, మార్చి 23 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో కేసముద్రం మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వరరావు దంపతులు సోమవారం ఘనంగా సత్కరించారు.

తెలంగాణ రాష్ట్ర సీఎం ప్రధాన సలహాదారులుగా అపూర్వ సేవలందించి, కేసముద్రం పట్టణ అభివృధి ప్రదాతగా నిలిచారని, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలని ఆకాంక్షించారు.